ఈరోజు నుండి ఫస్టాగ్(Fastag) తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన నూతన విధానం ఫస్టాగ్(Fastag). ఇప్పుడు ప్రతి వాహనానికి ఇది అవసరం. అసలు ఫస్టాగ్ అంటే ఏమిటి? దీనిని ఎల పొందాలి, దానివలన ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్టాగ్ అంటే ఏంటి?
ఫస్టాగ్స్ అంటే ప్రీపెయిడ్ రీఛార్జ్ కార్డ్స్. అవి వాహనం ముందు భాగంలో అమర్చబడి ఉంటాయి. దీనివల్ల వాహనాలను టోల్ ప్లాజా వద్ద ఆపకుండానే బిల్లు చెల్లించవచ్చు . ఇవి RFID అనే సాంకేతిక పరిజ్ఞానం తో పనిచేస్తాయి. ఫస్టాగ్స్ బ్యాంకు ఖాతా కు అనుసంధానించబడి ఉంటాయి. వీటికి గడువు తేదీ అనేది ఉండదు. టోల్ ప్లాజా దాటే క్రమంలో వాహనము యొక్క టోల్ రుసుము ఫస్టాగ్ ద్వారా, అనుసందించిన ఖతా నుండి దానంతట అవే బదిలీ అయిపోతవి.
ఫస్టాగ్ ఎల పొందాలి ?
ప్రభుత్వ, ప్రైవైట్ మరియు సహకార బ్యాంకులలో ప్రత్యేకంగా కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో లభిస్తాయి.
కావాల్సినవి :
1 . వాహన రిజిస్టార్టైన్ సర్టిఫికెట్ (RC )
2 . వాహనదారుడు గుర్తింపు కార్డు (Identity proof )
3 . రెండు పసోపోర్ట్ సైజు ఫొటోస్ (2 photos )
పైన తెలిపిన వాటిని రెండు నాకళ్ళు(xerox ) లను ఇవ్వాల్సి ఉంటుంది. మరియు 500 నగదు చెల్లించాల్సి ఉంటుంది. దింట్లో 100 ఫస్టాగ్ ఖరీదు, 200 సెక్యూరిటీ డిపోసిట్ మరియు మిగిలిన 200 ఫస్టాగ్ వాలెట్ లో ఉంటుంది. మనీ వాల్లెట్స్ ఉదా: amazonPay , paytm మొదలగునవి ఉపయోగించి కావలసినపుడు రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా బ్యాంకులు అందించే మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి ?
ఫస్టాగ్ వాహనం ముందు భాగంలో ఉన్న అద్దానికి అమర్చబడి ఉంటుంది. వాహనం టోల్ ప్లాజా దాటుతున్న సమయంలో ఆటోమేటిక్ గ టోల్ రుసుము చెల్లింపబడుతుంది. ఈ ప్రక్రియ అంత 10 సెకన్లలో పూర్తి అవుతుంది. మరియు దానికి సంబందించిన సంక్షిప్త సందేశం అనుసందించబడిన మొబైల్ నెంబర్ కి వస్తుంది. ఫస్టాగ్ కి సంబందించిన బాలన్స్ ఎంత ఉందొ తెలుసుకోవడానికి MY Fastag Mobile APP ఇన్స్టాల్ చేసుకొని చూడొచ్చు మరియు APP ద్వారా ఫస్టాగ్ అకౌంట్ లో కూడా అమౌంట్ వేసుకోవచ్చు .
ఫస్టాగ్ తీసుకోకపోతే ఏమి అవుతుంది ?
డిసెంబర్ ఒకటి నుండి , అన్ని వాహనాలకు ఫస్టాగ్ తప్పనిసరి. ఒకవేళా లేనట్లయితే, లేని సంబంధిత వాహనాలు అన్ని టోల్ ప్లాజా వద్ద కేటాయించిన ఒకే ఒక మార్గంలో వెళ్ళాలి. లైన్లో నిరీక్షణ తప్పదు . ఒకవేళా ఖాళీగా ఉన్న ఫస్టాగ్ వాహనాలకు సంబందించిన మార్గంలో వెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం రెట్టింపు మూల్యం చెల్లించక తప్పదు.
మనం వెళ్లే మార్గంలో ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి వాటికీ ఎంత రుసుము ఉంటుందో మనం తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక APP ని అందుబాటులో ఉంచింది . దాని పేరే "సుఖద్ యాత్ర " . దీని వలన మనం ఎంత రీఛార్జ్ చేసుకోవాలో ముందుగానే తెలుసుకోవచ్చు.
టోల్ ప్లాజా చుట్టూ 20 km పరిధిలో ఉన్న , నిర్వాసితులకు స్థానిక కోట కింద మునుపటి ల రాయితీని ఇస్తారు, దీనికి సంబందించిన వివరాలు టోల్ ప్లాజా ల వద్ద అందుబాటులో వంటుంది. మరియు తరచూ ప్రయాణించే వాహనాలు నెలవారీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయి
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాలు ఎన్ని ?
ఏపీ మరియు తెలంగాణాల మొత్తం కలిపి 64 ఉన్నాయి వీటిలో ఏపీ లో ఉన్న ౩౦ ప్లాజా లో పూర్తయింది. మిగిలిన టోల్ ప్లాజా ల వద్ద ఈ నెల చివరకు పూర్తవతాది అంటున్నారు.
ఫస్టాగ్ వలన ఉపయోగాలు ఏంటి ?
వాహనాలను టోల్ ప్లాజా వద్ద నిలుపవల్సిన అవసరం లేదు, దీనివల్ల సమయం మరియు ఇంధనం వృధా కాదు. టోల్ ప్లాజా వద్ద సిబ్బందిని కూడా తగ్గించవచ్చు. డిజిటల్ చెల్లింపుల వాళ్ళ నగదు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, చిల్లర కష్టాలు ఉండవు. అద్దె వాహనాల యజమానులకు తమ వాహనాలు ఏ టైం లో ఎక్కడ వెళ్ళింది మరియు ఎంత టోల్ రుసుము చెల్లించారు అనేది పక్క సమాచారం ఉంటది.
టోల్ మినహాయింపు, వాహనాలకు ఫస్టాగ్ అవసరమ?
అవసరమే టోల్ మినహాయింపు ఉన్న ప్రభుత్వా వాహనాలు టోల్ ప్లాజా వద్ద సంబంధిత సమాచారం ముందుగానే ఇవ్వాలి ఆలా చేస్తే ఆ వాహనాలకు జీరో టోల్ అప్లై అవుతుంది .
ఒక వాహనానికి సంబందించిన ఫస్టాగ్ మరొక వాహనానికి అమరిస్తే ఏమవుతుంది ?
అల ఫస్టాగ్ మార్చిన యెడల అలంటి వాహనాలను గుర్తించడానికి ప్లాజా ల వద్ద ప్రత్యేక సదుపాయం ఉంది.
దేశం మొత్తం మీద 23 % వాహనదారులు ఫస్టాగ్ వాడుతున్నారు, ఈ నెల ఆఖరు లోగ మరింత మంది ఫస్టాగ్ తీసుకుంటారు అని అధికారుల ఆంచన.