బలగం చిత్రం బంధలను, బంధల లోని భావోద్వేగాలను చూపించింది. అలనాటి ఆప్యాయతలను తెలియజేస్తుంది. ఇలాంటి బంధాలను ఒక చిత్రాల లోనే చూడగలం. నేటి సమాజం లో అనురాగాలు ఆప్యాయతలను టీవీ తెరలపైననో , వెండి తెరలపైనా మాత్రమే అద్భుతంగా చూడగలం వినగలం మరియు ఆస్వాదించగలం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అనురాగాలు ఆప్యాయతలు పైసలతోనే ముడిపడి ఉన్నాయి. అది సినిమాలో అయినా, సమాజంలో అయినా. ఒక చిత్రంలోని పాటలో పల్లవి  "అనురాగం కొనగల ధనముందా ఈ లోకంలో ... ", అంటే నిజంగా  కొనలేం అనే చెప్పాలి మరియు ఉచితంగా కూడా పొందలేము. 

అనురాగాలు ఆప్యాయతలు సమయాను సారం పుట్టుకొస్తాయి అది ఎప్పుడు అనేది లోక విదితమే. పైన చెప్పిన చిత్రం పాటలో ఉన్న పల్లవి నిజం కాదనిపిస్తుంది. ధనం తో అనురాగాన్ని కొనలేం అన్నది అవాస్తవం. ధనంతోనే  సినిమా ని చిత్రీకరించారు, సినిమాలో చూపించిన ఆప్యాయతలు, బంధాలు ధనంతోనే ముడిపడి ఉన్నాయి.

ధనమ్ మూలం ఇదం జగత్  వంద శతం వాస్తవం, ఎందుకంటే ఈ వ్యాసం లో ఉన్న సారాంశం నాకు  అనిపించిన  వాస్తవము అయినా కాకపోయినా , కొంత మేర మానసిక ఉల్ల్లాసానికి మరికొంత గుర్తింపు కోసం మరికొంత పైసల కోసం , ఎవరు ఎన్ని అనుకున్న, నమ్మిన నమ్మకపోయినా  ఇది స్తవం వాస్తవము.

ఇక బలగం చిత్రం విషయానికి వస్తే అన్నదమ్ముల మధ్య మరదలు తీసుకొచ్చిన విషయం వాస్తవినికి అతి చేరువలో ఉన్నాయ్. ఇది కొంత మాత్రమే  చూపించారు ఇంకా కొంచెం చుపించుంటే ఇంకా బాగుండేది. మరి ముఖ్యంగా భూ తగాదాలలో.

అందరు బాగుండాలనేది అందరి కోరిక అయితే ఈ సమాజం ఇలా ఉండేది కాదు , ఇది అందరికి వర్తిస్తుంది. చిత్రం తీసిన వాళ్ళైనా, చుసిన వాళ్ళైనా మరియు ఇది రాసిన నేనైనా  చెప్పటం సులభం చేయడం సులభం చేయాలన్న ఆలోచన కష్టం.

ఏది ఏమైనా మారిపోతున్న మనుషులకి , మారుతున్నా సమాజానికి , నేటి నవతరానికి  బంధాలను బంధుత్వాల మద్య ఉన్న ఆప్యాతనురగలను గుర్తుచేసిందనే చెప్పకనే చెప్పాలి. 

నిత్యావసర వస్తువులు ఎక్కడనుండి వస్తాయి నిజానికి అని అడుగుతే  దుకాణాల నుండి అని చెప్పే  తరానికి మాత్రం ఒక గొప్ప చిత్రం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అనురాగాలను ఆప్యాయతలు చలన చిత్రాలలోనే చూస్తున్నారు కాబట్టి.

బలగం సినిమాలో నటించిన కాదుకాదు జీవించిన నటి నటులకు మరియు చిత్రాన్ని ఆవిష్కారించిన చిత్ర బృందానికి  అభినందనలు.