ముఖ్యమంత్రి అయిన అనాదికలంలోనే సమకాలిన సమాజిక సమస్యలపైన  సహృదయముతో స్పందించి,సమజంలొని  అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ,సాంకేతికతను సైతం  జోడించి తదనుగుణంగా ఎన్నో సరికొత్త కార్యక్రమాలను  రూపొందించి, తెలంగాణా రాష్ట్రాన్ని అభ్యున్నతి పథం వైపు నడిపిస్తున్నారు.

ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే హైదరాబాద్ మహానగరం నడి బొడ్డున ఉన్న హుస్సన్ సాగర్ లో ప్రతి సవత్సరం గణేష్ ఉత్సవాల్లో బాగంగా గానేషుని ప్రతిమలను నిమర్జనం చేస్తున్నాము.కానీ అనేక రకాల కారణాల వలన సాగర్ ఇది  వరకే మురుగు నీటితో నిండింది.

దాని కోసం మన తెలంగాణా ప్రభుత్వం భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల శ్రేయస్సు కొరకు సాగర్ ప్రక్షాళన చేయాలనీ భావిస్తున్నాము.    

నా ఆలోచన ఏమిటి అంటే వచ్చే గణేష్ ఉత్సవాల్లో మట్టి ప్రతిమాలనే ఉపయోగించాలి.అందుకు గాను ముందుగానే ప్లాస్టర్ అఫ్ పారిస్ చే తాయారు చేయకూడదని ప్రకటన ఇవ్వాలి మరియు ప్రజలను కూడా మట్టి ప్రతిమాలనే కొనాలని,సాంఘిక సమాచార ప్రసారసాదనాల ద్వార ప్రజలను చైతన్య పరచాలి.

అలా చేస్తే తయారి దారుల నుండి వ్యతిరేకత వస్తుంది వారికీ మట్టి విగ్రహాలను తాయారు చేసే విధంగా ప్రేరేపించాలి లేదా ప్రభుత్వం తరపున వేరే ఉపాది కల్పించాలి.

ఇంకా గణేష్ ఉత్త్సవలకు నాలుగు నెలల సమయం ఉంది ఈ లోపు ప్రకటిస్తే బాగుంటుంది.ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను తాయారు చేసాక వద్దు అంటే తయారీ దారుల నుండి  వ్యతిరేకత వస్తుంది మరియు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇతర పార్టీలు దీనిని మరింత రాద్దాంతం చేస్తారు.

రాష్ట్రం మొత్తం మట్టి ప్రతిమలను ఉపయోగించి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలి.

2015 రాసిన లేఖ ఇది. గౌరవ హైకోర్టు చెప్పినపుడైన, ప్రభుత్వం తయారీదారులకు ముందే చెప్పాల్సింది. కానీ ముఖ్యంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో నే తయారీ చేసారు. అది ప్రారంభించినపుడైన ప్రభుత్వం, తయారు చేసేవాళ్లకు చెప్పాల్సింది లేదంటే మీడియా ద్వారా తెలియజేయాల్సింది 

ఇప్పుడు ఊహించిందే జరుగుతుంది.