ప్రపంచమంతా ఒకరిగురుంచి ఒకరు తెలుసుకుంటున్నారు... మీ గురుంచి మీరు తెలుసుకుంటున్నారా!
విశ్వమంతా అరచేతిలో ఉన్న, విజ్ఞాన శాస్త్రం మనుషులను దగ్గరచేస్తున్న, మనిషి మనసుల మధ్య అగాధం పెరుగుతూనే ఉంది.
ఇప్పుడున్న కరోనా మహమ్మారి ఒకరిగురుంచి మరొకరు తెలుసుకునేలా చేసింది. మనిషి మనసుల మధ్య దూరాన్ని తగ్గించింది.
ప్రపంచం అంత భారతదేశం గురుంచి తెలుసుకుంది. విపత్తు సమయంలో భారతదేశం ఎలా ఉంటుంది. సహాయం అడిగిన వాళ్ళకి ఎలా చేయూతను ఇస్తుందో ఇతర దేశాలు తెలుసుకున్నాయి. అదే సమయంలో మన దేశానికి ఎం కావాలో తెలుసుకున్నాం. ప్రపంచ రవాణా వ్యవస్థ స్తంభించిన వేళా, మనదేశానికి ఎం కావాలో, మన దగ్గర ఉన్న శస్త్ర సాంకేతిక పరిజ్ఞానము మరియు మనకు ఉన్న వనరులతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు కరోనా నిర్ములకు మరియు తగ్గించేందుకు అవసరమైన వస్తువులను తయారుచేసుకొని వినియోగిస్తున్నాం.కరోనా కొన్ని కొత్త ఆవిష్కరణలకు నంది పలికింది.
అదేవిధముగా ఒక రాష్ట్రం గురుంచి మరొక రాష్ట్రం తెలుసుకుంటుంది. అవసరమైన వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడ్పడుతున్నారు.
ఒకప్పుడు ఇంట్లో అందరు కలవాలి అంటే పండుగకు లేదంటే ఏదైనా అత్యవసర సమయంలో మాత్రమే కలిసేవారు అది కూడా ఒకటి లేదా రెండు రోజులు.
పల్లెలో తల్లి తండ్రులు వుండీ, పట్టణంలో పిల్లలు చదువుకోసమో లేదంటే ఉద్యోగం కోసమో ఉన్న సందర్భంలో , తల్లిదండ్రులు ఇంటికి పండుగకు లేదంటే చూడటానికో రమ్మని అంటే పిల్లలు, ఇచ్చే రెండు మూడు రోజులకి ఎం రావాలని వచ్చేవారు కాదు. ఉంద్యోగం చేస్తే అవసరానికి డబ్బు పంపిచేవారేమో. కానీ తల్లిదండ్రుల ఆశ అది కాదు, పిల్లలు పెద్దవాళ్లు అయినా తరువాత, తల్లి దండ్రులు పిల్లలపై డబ్బు కోసం అదర పడకపోయినా , ప్రేమ, ఆప్యాయతను ఆశిస్తారు. అది నేటి తరం పిల్లలు గమనించాలి.
ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు గురుంచి చెప్పక్కర్లేదు, తల్లి దండ్రులు కష్టపడి చదివించి పంపిస్తే, ఎప్పుడో ఒకసారి రమ్మని అంటే. ఈ నిబంధనలు ఆ నిబంధనలు ఉంటాయని అని చెప్పి తల్లి దండ్రులను సముదయిస్తారు. అప్పుడు వాళ్ళు కోరుకునేది ఒకటే ఎక్కడున్నా సంతోషంగా ఉంటె చాలు అని. నిష్పక్షపాతమైంది తల్లి దండ్రుల ప్రేమ.
ఇలాంటి వారందరికీ కరోనా ఒక గుణపాఠం. ఇకనైనా సమయం దొరికినపుడు కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని న అభిప్రాయం.
ఇక గ్రామాల విషయానికి వస్తే ఎప్పుడు పొలం పనులతో తీరిక లేకుండా ఉండే రైతన్నలు కాస్త నెమ్మదించారు. ఈ మాసంలో పంట చేతికి వస్తుంది దాన్ని అమ్మాలి మరియు వచ్చే మాసంలో కొత్త పంట వేసేందుకు నేలను చదును చేయాలి. ఆ ప్రయత్నాలలోనే ఉన్నారు గృహ నిర్బంధం వలన పనులు కాస్త నెమ్మదించాయి అని చెప్పుకోవాలి.
గ్రామాలలో ఉన్న ప్రజలు ఒకరి గురుంచి ఒకరు తెలుసుకుంటున్నారు. కొందరు రైతన్నలు తాము పండించిన ధాన్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. అదే విధముగా కూరగాయలు పండించిన రైతులు అంగడికి తీసుకు వెళ్లే వేలు లేక కావలసిన వాళ్ళని తీసుకొమ్మని తోటి వారికీ చెబుతున్నారు.
ఇక కుటుంబం విషయానికి వస్తే తీరికలేకుండా పనికి లేదా ఉద్యోగానికి వెళ్లే తండ్రి లేదా తల్లి దండ్రులు, పిల్లలతో గడిపే సమయం చాల తక్కువ. వేసవిలో పిల్లలకు సెలవులు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పనులోమతో బిజీ గ ఉంటారు. ఇలా మొత్తం మీద కరోనా వాళ్ళ కుటుంబంలో అందరు ఒకరి గురుంచి ఒకరు తెలుసుకుంటున్నారు.
మన గురుంచి మనం తెలుసుకోవడం, కొంతమంది సామజిక మాధ్యమాల్లో సమయాన్ని వెచ్చిస్తున్నారు, మరికొంతమంది ఒకరిపైఒకరు పందాలు వేసుకొని చేస్తున్నారు. కొంతమంది మాత్రం తమలో ఉన్న అదృశ్య శక్తిని వెలికితీసే పనిలో ఉన్నారు. ఇంకా కొంత మంది భవిషత్తు ప్రణాళికలు వేస్తున్నారు. కొంతమంది ఇంటి పనులకు సహకరిస్తు ముందుకు నడుస్తున్నారు.
ఇలా ఒకరిగురుంచి ఒకరు తెలుసుకునేలా ఇలా ఉంటె.
సృష్టి లో మానవ మేధస్సు గొప్పది. విశ్వ అంతరాలన్నీ జయించిన మానవుడు. విశ్వంలో ప్రకృతి మరియు అందులో ఉన్న మనుషులు, పశు పక్షాదులు కూడా భాగమే. మానవ మేధస్సుతో ప్రకృతిని మరియు అందులో ఉన్న వనరులను ఉపయోగించి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో భాగమే ఇప్పుడు వచ్చిన కరొన.
ఈ కరొన చాల పాఠాలను గుణ పాఠాలను నేర్పుతుంది.
ఈ అంతుచిక్కని మహమ్మారి ఉన్న తరుణంలో మనషుల రూపంలో ఉన్న దేవుళ్ళు మానవ మనుగడను కొనసాగించేందుకు తోడ్పడుతున్నారు. ఆ దేవుళ్ళే డాక్టర్స్, పరిశుద్ధ కార్మికులు, రక్షణ వ్యవస్థ, ప్రభుత్వం, సంబంధిత అధికారులు, సామాజిక వ్యవస్థలు మరియు మానవత్వం ఉన్న ఎందరో మహానుభావులు, ముఖ్యంగా వీటన్నిటిని అనుసంధిస్తున్న, ప్రతి క్షణం సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న పత్రిక మరియు దృశ్య గ్రాహక వ్యవస్థ అందులో పనిచేస్తున్న వ్యక్తులు. వీళ్ళందరికీ ఇదే నా వందనం.
గడిచిన మాసం రోజులలో ఎన్నో ఘటనలు మరెన్నో విశేషాలు. కొంతమంది సేవ చేస్తూ నివాస ఆవాసం లేని వాళ్లకు ఆసరాగా నిలుస్తూ, ఆశ్రయం కల్పిస్తూ ఆదర్శముగా నిలుస్తున్నారు. మరికొంతమంది మానవత్వాన్ని మరచి అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారు. చట్టం ముందు సమానం నానుడి ఎంత నిజమో ప్రకృతి ముందు జీవరాశులన్నీ సమానమే. కాకపోతే ఒకరు ముందు ఒకరు తర్వాత అంతే చేరాల్సిన గమ్యస్థానం ఒకటే. చాల మంది ప్రజలకు ప్రభుత్వాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ఉదరభావాన్ని ప్రకటిస్తున్నారు.
ఈ మాసంలో జరిగిన ఘటనలను, సంఘటనలను, నా పరిణితి మేరకు, నా మదిలో మెదిలిన ఆలోచనలు, స్వహస్తాలతో టైపు చేసి మీ ముందుంచే ప్రయత్నం చేశాను.
ఈ విపత్కర కాలంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతఙ్ఞతలు .
#stayhome #staysafe
Updated: 28-04-2020 V6 Velugu Daily News Paper (https://epaper.v6velugu.com/c/51372533)