హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఉన్నట్టుండి పట్టాలపైనా ఆగిపోయింది. అసలు ఎం జరిగింది ?
హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఆగిపోయిన ఘటన అమీర్పేట్ లో సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. ఈ మధ్య మెట్రో ట్రైన్ లో తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. బస్సులు ఆగిపోవడంతో మెట్రో లో ప్రయాణికులు మరియు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది . నిన్నటి మెట్రో రివ్యూ లో ఒక రోజే నాలుగు లక్షల పైబడి మెట్రో లో ప్రయాణిస్తున్నారు అని గణాంకాల ద్వారా తెలుస్తుంది.
ఈరోజు జరిగిన ఘటనలో ఉన్నటుండి అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయిందని విశ్వ సనీయ సమాచారం. దీనికి కారణం కొంతమంది మెట్రో విద్యుత్ తీగలు తెగిపోయాయని కొందరు మరియు సాంకేతిక లోపము అని మరి కొందరు ప్రయాణికులు అంటున్నారు . దింతో ప్రయాణకులు చాల ఇబ్బంది పడ్డారు. అది కాకుండా సాయంత్రం సమయం కాబట్టి రద్దీ కూడా చాల ఎక్కువగా ఉంది. దింతో అమీర్పేట్ నుండి హైటెక్ సిటీ వెళ్ళవలసిన మెట్రో ట్రైన్స్ కి అంతరాయం కలిగింది. ఏదేమైనప్పటికీ ఇలా తరచు మెట్రో లో సాంకేతిక లోపాలు తలెత్తడం వలన మెట్రో విశ్వతనియతాను కోల్పోయే ప్రమాదం ఉంది . ఇకనైనా మెట్రో అధికారులు ఇలాంటి లోపాలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు.