నవ సమాజ సమానత్వం
ఆధునిక సమాజంలో, విజ్ఞానశాస్త్రం విశ్వ అంతరాన్ని స్పృశిస్తున్న ,నేటి నవ సమాజంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనుషుల మధ్య దూరం తగ్గిన కానీ, మనషుల మనసుల మధ్య అగాధం పెరిగింది. మనుషుల మధ్య సమానత్వం కొరకు ప్రభుత్వం మరియు ఎన్నో సంస్థలు అనేకానేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికీ ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. మనుషుల మధ్య కుల, మత, ప్రాంతీయ, వర్ణ మరియు ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఒక సరికొత్త అసమానత ఉంది అది లింగ భేదం.
స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉన్న నేటి సమాజంలో అసమానతలు ఇప్పుడిపుడే తగ్గుతున్నాయి. అనేక రంగాలలో, ఉదాహరణకు ప్రతిష్ఠమైన దేశ రక్షణకు సంబందించిన రక్షణ వ్యవస్థలో కొన్ని విభాగాలలో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ, మన సమాజంలో ఉన్న మూడవ లింగం ట్రాన్స్ జెండర్స్ వీరికి నేటి సమాజంలో గౌరవ మర్యాదలు లభించడం లేదు. వాళ్లు కూడా మిగతా మనుషులతో సమానంగా రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వారు సమాజంలో వేరుచేయబడి ఉంటున్నారు. వారికి కనీసం ఆదరణ కూడా లభించడం లేదు. వారు సమాజంలో బ్రతకడం కోసం చేస్తున్న వృత్తులు యాచించడం అదే ఒక ఆదాయ వనరుగా వారికి ఉపయోగపడుతుంది. మనుషులలో అంగవైకల్యం ఉన్నవారికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. కానీ వీరికి ఎలాంటి సహాయం చేయరు. మామూలు మనుషులకు ఉన్న ప్రభుత్వ పథకాలు వీళ్లకు వర్తించవు. ఈ విధంగా ప్రభుత్వమే వాళ్లను గుర్తించకపోతే సమాజంలో ఉన్న ప్రజలు ఎలా గుర్తిస్తారు. వాళ్లు కూడా అందరిలాగే సమాజంలో బ్రతకాలి అనుకుంటారు. వారి ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం మరియు ప్రైవేటు మరియు సామాన్య ప్రజలు సహకరించాలి వారి పరిజ్ఞానం మేరకు చేయదగిన ఉపాధి అవకాశాలు కల్పించాలి.
మిత్రుడు సతీష్ ,ఎన్జీవో( నేను నా పల్లె) నిర్వాహకుడు . తాను టీవీలో brooke bond 3 roses అడ్వేర్టైస్మెంట్ చూసినపుడు వచ్చిన ఆలోచననే అమలుచేశారు.
బ్రూక్ బాండ్ త్రి రోసెస్ టీవీ ప్రకటన ఏమిటంటే " ఒక రోజు సాయంత్రం వర్షం కురిసే వేళలో, కారులో ప్రయాణిస్తున్న బామ్మా మరియు మనుమరాలు, ట్రాఫిక్ జాం లో కార్ లో ఉన్నపుడు అక్కడే పక్కనే ఉన్న టీ షాప్ నిర్వహిస్తున్న ఒక ట్రాన్సజండార్, కార్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతోంది అప్పుడు బామ్మా డబ్బులు ఇవ్వబోతుంది, అపుడు ఆ ట్రాన్సజండార్ తనకు ఉచితంగా టీ ఇస్తుంది రిటర్న్ గ బామ్మా ఆశీర్వాదం ఇస్తుంది. ఈ ఒక నిముషం నిడివి గల వీడియో అందరిని ఆకట్టుకుంది. Hindustan Unilever గతంలో కూడా ఈలాంటి వీడియోస్ ని రూపొందించింది.
FB video NENU NA PALLE MARIYU TRANS EQUALITY SOCIETY
https://www.facebook.com/100001153588002/videos/pcb.3387913751257044/3387910141257405AD: BROOK BOND
NENUNAPALLE
FB: https://www.facebook.com/sateesh.kothakota.5/posts/3387913751257044
LOCATION: SURARAM, HYDERABAD
మిత్రుడు సతీష్ ఆలోచన వచ్చిందే తడవుగా TRANS EQUALITY SOCIETY ని సంప్రదించి తన ఆలోచనను వాళ్ళతో పంచుకున్నాడు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సతీష్ తన ngo కార్యక్రమాలలో భాగంగా ,ప్రతి నెల మిత్రుల సహాయంతో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు, ఈ నెల TRANS EQUALITY SOCIETY వాళ్ళకి తన ఆలోచన నచ్చడంతో, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. హైదేరాబద్ నగరం లో సూరారం ప్రాంతంలో NENU NA PALLE వారి సహకారంతో మరియు TRANS EQUALITY SOCIETY వల్ల ఇంట్రెస్ట్ తో ఒక TEA స్టాల్(QUICKLES) ప్రారంభించారు. దీని బట్టి వాళ్లకు సమాజంతో కలిసి బ్రతకాలన్న ఉత్సుహకత మరియు అందరితో సమానంగా పని చేయగలమన్న దృఢ సంకల్పం కనిపిస్తుంది. ఒక ఆలోచన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ విధంగా మిగతా రంగాలలో కూడా సమానంగా రాణించగల సాహసం వాళ్లకు ఉంది, చేయాల్సిందల్లా వాళ్లకు తోడ్పాటును అందించడం. నా మిత్రుడు అదే ఆలోచనతో ముందుకెళ్లి, వాళ్ళకి ఆత్మ స్తైర్యాన్ని, సమాజంలో మిగతావాళ్లతో సమానంగా వాళ్ళు కూడా రాణించగలరని నిరూపించాడు.
ఈ ఆలోచనను ఆసరాగా తీసుకోని ముందుకు తీసుకొచ్చిన TRANS EQUALITY SOCIETY మరియు NENU NA PALLE సంస్థలకు నా అభినందనలు. వాళ్ళు మున్ముందు ఇలాంటి ఎన్నొ మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శనంగా నిలవాలని కోరుకుంటున్నాను.
మనుషులు అందరు మంచివాళ్ళే కాని సమాజం మరియు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. మున్ముందు ఈ ట్రాన్సజెండర్లు కూడా సమాజంలో మిగతావారితో సమానంగా రాణిస్తారని కోరుకుంటున్నాను.