పల్లె పయనం అవుతుంది. .. పల్లెలలో సాగుభూమి కరువవుతుంది. ...
ఒక సామెత ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు. వ్యవసాయదారులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడం లేదా పెళ్లి చేయడం ఈ రెండిట్లో ఏది చేయాలన్నా భూమి ఉంటే అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఉన్న అరకొర భూముల్లో వ్యవసాయం చేసి సంపాదించింది పూట గడవడం కోసమే. సమాజ పోకడలకు అనుగుణంగా మారాల్సి వస్తుంది. ఊర్లో ఒకరిని చూసి ఒకరు లేదా ఏళ్లతరబడి ఉన్న గృహాలను తొలగించి కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. దీనికి కారణం ఉన్న పురాతన గృహం సౌకర్యంగా లేకపోవడం లేదా పాడైపోవడం మరియు పక్కన ఉన్న వాళ్ళు కొత్త ఇల్లు నిర్మిస్తుంటారు లేదా ఇంట్లో పెళ్లి లాంటి శుభకార్యం ఉండడం. వీటికి కావలసిన సొమ్మును వ్యవసాయం చేసి సంపాదించ లేము ఎందుకంటే నిర్మాణ వ్యయాలు పెరగడం. ఇక శుభకార్యాల విషయానికొస్తే ఆడంబరంగా చేయడానికి ఖర్చు.
ఇలా కారణమేదైనా ఖర్చు అత్యవసరం. దానికోసం అప్పులు చేయడం లేదా ఉన్నవాటిని అమ్ముకోవడం తప్పనిసరి అవుతుంది.
ఇదిలా ఉంటే, మరొక కొత్త రకమైన భూమి అమ్మవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అది భూ దందాలు చేసి వారి వలన జరుగుతుంది. అది ఏంటంటే ఒక గ్రామంలో ఒకరు తమ అవసరాల కోసం భూమిని అమ్మినప్పుడు, కొన్నవాళ్లు అక్కడ ఉన్న చెట్లను తొలగిస్తారు నేలను చదును చేసి రహదారులు నిర్మిస్తారు. ఇలా చేయడం వలన ముఖ్యంగా చెట్లలో ఆవాసం ఏర్పరుచుకున్న పశుపక్షాదుల కు స్థావరం పోతుంది. పచ్చని పొలాల మధ్య కాంక్రీట్ జంగిల్ స్ ఏర్పడుతున్నాయి. కానీ పొలం చుట్టూ ఉన్న పెద్ద చెట్లను తొలగించడం వలన అందులో ఉన్న కొన్ని రకాల చెట్లను నరకడం నేరం కానీ ఇలా ఒకేసారి చదును చేయడం వలన వాటిని తొలగించిన ఎటువంటి నేరం వర్తించదా?
ఇదిలా ఉంటే అవసరానికి అమ్ముకున్న భూమి పక్కన ఉన్న ఇతర భూమి యజమానులు భూమి కొనే వాళ్ళ ఒత్తిడికి లేదా వాళ్లు చెప్పే మాటలకు లేదా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపడం ఇలా మొదలైన కారణాల వల్ల భూమిని అమ్మడం ఆవశ్యకమైనది. ఒకప్పుడు ఒక పొలం నుండి మరొక పొలం కి చూడడానికి వీలు లేకుండా దట్టమైన చెట్లు పొదలు ఉండేటివి ఇప్పుడు అవేమీ లేవు కనుచూపుమేర ఎటు చూసినా పొడవైన చెట్లు కనిపించడం లేదు. అక్కడ అక్కడ నిర్మించిన భవనాల మాదిరిగా అక్కడ అక్కడ కొన్నిచోట్ల ఉంటున్నాయి.
ఇప్పుడున్న పల్లె వాతావరణంలో స్పష్టమౌతుంది ఏమిటంటే ఉన్నదాంట్లో కొంచెం అమ్మేసి విలాసవంతమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు భూమి అమ్మడం వద్దన్నా వాళ్ల పిల్లలు తోటి మిత్రులను చూసి లేదా సమాజాన్ని చూసి వాళ్ళ లాగా విలాస వంతంగా ఉండాలని తల్లిదండ్రులపై భూమి అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉన్న కొంత భూమిలో ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. కూలి చేసేవాళ్ళు గత్యంతరం లేక, అమ్మిన భూమి స్థలంలో నిర్మించిన లేదా నిర్మించబోయే స్థలంలో చూసుకోవడానికి పనికి కుదురుకున్నారు.
ఇదిలా ఉంటే మరొక రకమైన పరిస్థితి నెలకొంది. ఎక్కువ భూమి ఉన్నవాళ్లు లేదా ఎక్కువ డబ్బులు వచ్చే భూమి ఉన్న వాళ్లు దానిని అమ్మేసి ఆ డబ్బుతో తక్కువ ధర కు వచ్చే మరికొన్ని భూములను కొనుగోలు చేసి, ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్మడం. ఇది చూసి మరికొందరు అలా చేయడం వలన చేతులు కాల్చుకుంటున్నారు.
చివరిగా జరుగుతున్నది ఏంటంటే కొందరు తమ అవసరాలకు మరియు అభివృద్ధికి లేదా అభ్యున్నతికి కోసం చేసే పనులు మరికొందరికి ఆటంకాలు అవుతున్నాయి. కొన్ని పనులు ఒకరిని చూసి ఒకరు చేయాల్సి వస్తుంది.
వీటన్నింటికీ కారణం సమాజంలోని ఆర్థిక అసమానతలు. వీటిని తొలగించాలంటే విద్య ఒక్కటే సరైనది. విద్య ఒక తరం రూపురేఖలను మారుస్తుంది. పిల్లలు విద్యావంతులైతే తల్లిదండ్రులకు నచ్చ చెబుతారు.
"ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో, వ్యవసాయం చేసే వాళ్ళు ఉండరు, చేయడానికి భూమి ఉండదు. ఇప్పటివరకు కరువు అంటే అతివృష్టి లేదా అనావృష్టి. కానీ రానున్న రోజుల్లో మనం వినవలసి వచ్చేది సాగుభూమి కరువు.. సాగుచేసే రైతన్న కరువు...
అదే కనుక జరిగితే ఇంటి ఇంటి సాగుబడి తప్పదు. ఇంతకీ పల్లెల పయనమెటో వేచి చూడాల్సిందే"
ఇన్ని పరిస్థితులు నెలకొన్న, తలొగ్గకుండా వ్యవసాయమే పరమావధిగా జీవనం కొనసాగిస్తున్న ఓ రైతన్న నీకు వందనం.